మేరా భారత్ మహాన్ : అమెరికాలోని స్కూల్స్ కు.. దీపావళి సెలవు

మేరా భారత్ మహాన్ : అమెరికాలోని స్కూల్స్ కు.. దీపావళి సెలవు

న్యూయార్క్ నగరంలో దీపావళిని పాఠశాలలకు సెలవు దినంగా పాటించనున్నట్లు మేయర్ ఎరిక్ ఆడమ్స్  ప్రకటించారు. 2023, జూన్ 26వ తేదీ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారాయన. దీపావళి యునైటెడ్ స్టేట్స్‌లో అత్యంత ఎక్కువ మంది జరుపుకునే భారతీయ పండుగలలో ఒకటి. ప్రవాస భారతీయ-అమెరికన్‌లతో పాటు అనేక వర్గాలలోని అమెరికన్ పౌరులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు.

ALSO READ: యాదాద్రి కాంగ్రెస్​లో భగ్గుమన్న అసమ్మతి: కుంభం అనిల్​కుమార్​రెడ్డి

ఈ సందర్భంగా ట్వీట్ చేసిన న్యూయార్క్ నగర మేయర్ ఆడమ్స్.. స్థానిక కుటుంబాలకు ఇది ఒక ముఖ్యమైన విజయంగా అభివర్ణించారు. దీపావళిని పాఠశాలకు సెలవు దినంగా మార్చడంలో సహాయం చేసినందుకు ఇండియన్-అమెరికన్ న్యూయార్క్ శాసనసభ సభ్యురాలు జెనిఫర్ రాజ్‌కుమార్, ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. దీపావళి రోజున పాఠశాలకు సెలవు దినంగా చేయాలనే పోరాటంలో అసెంబ్లీ సభ్యురాలు జెనిఫర్ రాజ్‌కుమార్, సంఘం నాయకులతో కలిసి నిలబడినందుకు చాలా గర్వంగా ఫీలవుతున్పట్లు స్పష్టం చేశారు ఆడమ్స్. శుభ్ దీపావళి అంటూ రాసుకొచ్చారు. న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ బిల్లుపై సంతకం చేస్తారన్న నమ్మకం తనకు ఉందని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు.

https://twitter.com/NYCMayor/status/1673366496460824576