రామాయణ రైళ్లలో మారిన సిబ్బంది కాషాయ డ్రెస్ కోడ్

రామాయణ రైళ్లలో మారిన సిబ్బంది కాషాయ డ్రెస్ కోడ్

రామాయణ సర్క్యూట్ ప్రత్యేక రైలులో పనిచేస్తున్న వెయిటర్ల దుస్తులపై ఉజ్జయిని సాధువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.  వెయిటర్లు కుంకుమపువ్వు రంగు బట్టలు, ధోతీ, తలపాగా, రుద్రాక్షలతో దండలు ధరించారు. ఇది తమను అవమానించడమేనన్న సాధువులు..వెయిటర్లు వేరే దుస్తులు ధరించాలని డిమాండ్ చేశారు. డిసెంబరు 12న ప్రారంభమయ్యే రైలు తదుపరి ట్రిప్పును నిలుపుదల చేయాలని హెచ్చరిస్తూ ఉజ్జయిని సాధువులు రైల్వే మంత్రికి లేఖ రాశారు.  రైలును ఆపాలని కూడా భావిస్తున్నట్టు చెప్పారు సాధువులు. దీనిపై స్పందించిన రైల్వే మంగళవారం ఓ  నిర్ణయం తీసుకుంది. వెయిటర్ల డ్రెస్ కోడ్ ను రైల్వేశాఖ మార్చింది. సాధారణ చొక్క, ప్యాంట్, తలపాగా ధరించి యాత్రికులకు వెయిటర్లు సేవలందిస్తారని తెలిపింది. ఈ క్రమంలోనే కొత్త డ్రెస్ కోడ్ కు సంబంధించిన ఓ ఫొటోను విడుదల చేసింది రైల్వే. అయితే కాషాయ రంగు మాస్కులు, చేతి గ్లౌజుల్తో మార్పు చేయలేదు.  


డిసెంబర్ 12న రైలు తదుపరి ట్రిప్ ఇలా..

డిసెంబర్ 12న రామాయణ ఎక్స్‌ప్రెస్ రైలు తదుపరి ట్రిప్ మొదలవుతుంది. దీని కోసం, ఐఆర్సీసీటీసీ(IRCTC) వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ బుకింగ్ చేయవచ్చు. బుకింగ్ మొదట వచ్చిన వారికి ముందుగా అందించబడుతుంది. ఏసీ ఫస్ట్‌క్లాస్‌లో ప్రయాణించేందుకు ఒక్కొక్కరికి రూ.1 లక్షా 02 వేల 95, సెకండ్ ఏసీలో ప్రయాణిస్తే రూ.82 వేల 950గా నిర్ణయించారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి ప్రయాణీకుడు కోవిడ్‌కు సంబంధించిన రెండు వ్యాక్సిన్‌లను పొందాల్సి ఉంటుంది.