ఏపీలో 2వేలకు కొని సిటీలో 10వేలకు అమ్ముతున్రు

V6 Velugu Posted on Jan 10, 2022

  • 294 కిలోల గంజాయి సీజ్ చేసిన రాచకొండ పోలీసులు
  • నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు: సీపీ మహేష్ భగవత్

హైదరాబాద్: గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ దందా నడుపుతున్న ముఠాలో నలుగురిని రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. రామన్నపేట పోలీసు స్టేషన్ పరిధిలో ఎస్ఓటి పోలీసులు తనిఖీలు చేస్తుండగా డ్రగ్స్ ముఠా పట్టుపడింది. వారి దగ్గరి నుంచి 294 కేజీల గంజాయి సీజ్ చేశారు. ముఠా అరెస్ట్ సందర్భంగా రాచకొండ సీపీ మహేష్ భగవత్ మీడియా సమావేశం నిర్వహించారు. రామన్న పేట పీస్ పరిధిలో SOT పోలీసుల తనిఖీలో డ్రగ్స్ ముఠాను పట్టుకున్నట్లు తెలిపారు.

ప్రధాన నిందితుడు నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన తిరుపతి ఆరుగురితో కలిసి గంజాయి దందా చేస్తున్నట్లు చెప్పారు. ఏపీ లో ఏజెన్సీ లో 2 వేలు రూపాయలకు గంజాయి కొని, హైదరాబాద్ లో 10 వేల రూపాయలకు అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు.  2 కిలోల గంజాయి విడి విడిగా ప్యాక్ చేసి అమ్మకాలు చేస్తున్నారని తెలిపారు. ముఠాలో నలుగుర్ని అరెస్ట్ చేశామని.. ఏపీకి చెందిన బుచ్చి బాబు, సురేంద్ర దొర పరారీలో ఉన్నారని.. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీసీ మహేష్ భగవత్ వివరించారు. 

 

 

 

ఇవి కూడా చదవండి


మోడీ కాన్వాయ్ను అడ్డుకున్న చోటు.. పాక్ బార్డర్కు 15 కిలోమీటర్లే

టీకా పంపిణీలో ముందంజలో తెలంగాణ

ప్లేట్​ దోసె 2, ఇడ్లీ 3, ఊతప్పం 4 రూపాయలు

 

Tagged Hyderabad, POLICE, arrest, CP, Rachakonda, Drugs Gang, Mahesh Bhagawat, SOT

Latest Videos

Subscribe Now

More News