యమహా కంపెనీ పాపులర్ స్కూటర్ ఫాసినో 125 (Fascino 125 Fi Hybrid) లో సరికొత్త మార్పులు చేసి 2026 వెర్షన్‌ను విడుదల చేసింది. ఈసారి యమహా ఫాసినో వెనుక భాగాన్ని కొత్త డిజైన్, స్టైలిష్ లుక్ తో పూర్తిగా మార్చేసింది. స్కూటర్ వెనుక భాగం ఇప్పుడు మరింత నాజూకుగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. అయితే కొత్తగా 'V' ఆకారపు టెయిల్ లైట్ ఇచ్చారు. బాడీ ప్యానెల్స్, ఇండికేటర్లలో కూడా మార్పులు చేశారు, దీనివల్ల రద్దీగా ఉండే నగరాల్లో స్కూటర్‌ను నడపడం మరింత ఈజీ అవుతుంది.
ధర, వేరియంట్లు
*కొత్త ఫాసినో ప్రారంభ ధర రూ. 76,500 (ఎక్స్-షోరూమ్) నుండి మొదలై, టాప్ మోడల్ రూ. 95,200 వరకు ఉంటుంది. ఇంకా మూడు రకాల్లో లభిస్తుంది.
*డ్రమ్ బ్రేక్ వేరియంట్: ఎరుపు, నలుపు, తెలుపు రంగుల్లో దొరుకుతుంది.
*డిస్క్ బ్రేక్ వేరియంట్: బ్లూ, గ్రీన్, మ్యాట్ బ్లూ రంగుల్లో వస్తుంది.
*ఫాసినో ఎస్ (టాప్ మోడల్): మ్యాట్ గ్రే, మ్యాట్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
ఫీచర్లు & ఇంజన్
ఇందులో 125cc హైబ్రిడ్ ఇంజన్ ఉంది. ఇది త్వరగా స్పీడ్ అందుకోగలదు. స్మార్ట్ ఫీచర్లలో స్కూటర్ స్టార్ట్ అయ్యేటప్పుడు అస్సలు సౌండ్ రాదు. అలాగే ట్రాఫిక్‌లో ఆగినప్పుడు ఇంజన్ దానంతట అదే ఆగిపోయి, మళ్లీ యాక్సిలరేటర్ ఇవ్వగానే స్టార్ట్ అవుతుంది. దీనిని స్టార్ట్ స్టాప్ సిస్టం అంటారు. టాప్ మోడల్‌లో సెల్‌ఫోన్ కనెక్టివిటీ, దారి చూపిండానికి నావిగేషన్, మీ స్కూటర్ ఎక్కడ ఉందో గుర్తుపట్టే 'ఆన్సర్ బ్యాక్' ఫీచర్లు ఉన్నాయి. సీటు కింద 21 లీటర్ల స్టోరేజ్ ఉంటుంది, ఇందులో హెల్మెట్ లేదా ఇతర వస్తువులను పెట్టుకోవచ్చు. ఇతర ఫీచర్లలో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్-ఆఫ్, E20 ఇంధన కంపాటబిలిటీ ఉన్నాయి.
►ALSO READ | ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్: క్లెయిమ్ తర్వాత కవరేజ్ ఎలా మారుతుంది? మిగిలిన వారి పరిస్థితి ఏంటి ?
15 లక్షల మైలురాయి
2015లో మొదలైన ఫాసినో ప్రయాణం ఇప్పుడు 15 లక్షల స్కూటర్ల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. భారతీయ యువత ఇష్టాలకు అనుగుణంగా, మన దేశంలోని రీసెర్చ్ టీమ్ (R&D) ఈ కొత్త డిజైన్‌ను రూపొందించిందని యమహా తెలిపింది. ఈ స్కూటర్ సంవత్సరాలుగా 125ccకి మారడం, ఫ్యూయల్ ఇంజెక్షన్, హైబ్రిడ్ టెక్నాలజీతో సహా అనేక అప్‌డేట్‌లతో వస్తుంది. స్టైల్, మైలేజ్ రెండూ కావాలనుకునే వారికి ఈ కొత్త ఫాసినో ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

