మంటలు ఆర్పటానికి వెళ్లిన విమానం పేలిపోయింది

మంటలు ఆర్పటానికి వెళ్లిన విమానం పేలిపోయింది

గ్రీస్‌లో చోటుచేసుకున్న దురదృష్టకర సంఘటనలో, దేశంలో అగ్నిమాపక విమానం కూలిపోయింది. గ్రీన్స్‌లో కొనసాగుతున్న అడవి మంటల మధ్య అగ్నిమాపక విమానం కూలిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గ్రీస్‌లో చోటుచేసుకున్న దురదృష్టకర సంఘటనలో, దేశంలో అగ్నిమాపక విమానం కూలిపోయింది. గ్రీన్స్‌లో కొనసాగుతున్న అడవి మంటల మధ్య అగ్నిమాపక విమానం కూలిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 49 సెకన్ల వీడియో క్లిప్‌లో గ్రీస్‌లో కొనసాగుతున్న అడవి మంటల మధ్య అగ్నిమాపక విమానం దేశంలో కూలిపోతున్నట్లు చూపుతుంది.  అగ్నిమాపక విమానం గ్రీకు ద్వీపం ఎవియాలో కూలిపోయింది. విమానంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం.

గ్రీస్ లో  రోడ్స్ ద్వీపం, ఎవియా ప్రాంతంలోని అడవిలో మంటలు చెలరేగాయి. దీంతో రహదారులపై ప్రయాణించాలంటే కష్టంగా మారింది.  మంటలు చెలరేగిన ప్రాంతంలో 19 వేల మందిని రక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. గ్రీస్‌లో మంటలను అదుపు చేసేందుకు వెళ్లిన  అగ్నిమాపక విమానం మంగళవారం (జులై 25)  కుప్పకూలింది.   తక్కువ- ఎత్తులో వెళ్లే విమానం ఓ  లోయలో పడి క్రాష్ అయినట్లు వీడియోలో ఉంది.  ఎవియాలోని కరిస్టోస్ అనే పట్టణానికి  కార్చిచ్చు  మంటలు సమీపిస్తుండటంతో దగ్గరలోని  నాలుగు గ్రామాల ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకున్నామని అక్కడి అధికారులు తెలిపారు. 

దక్షిణ, మధ్య గ్రీస్ లోని తూర్పు ప్రాంతంలో ఎవియా ,  రోడ్స్‌కు ఆగ్నేయంగా ఉన్న రెండు తీర ప్రాంతాలలో మంటలు చెలరేగినప్పుడు 20 వేల మందికి పైగా ప్రజలు ద్వీపంలో  తరలింపులో పాల్గొన్నారని, వారిలో  ఎక్కువగా పర్యాటకులు ఉన్నారని అధికారులు తెలిపారు. మంటలను అదుపు చేయడానికి  యూరోపియన్ యూనియన్ 10 సభ్య దేశాల నుంచి  500 మంది అగ్నిమాపక సిబ్బంది, 100 వాహనాలు,   ఏడు   విమానాలను పంపగా, టర్కీ, ఇజ్రాయెల్, ఈజిప్ట్ వంటి  ఇతర దేశాలు కూడా సహాయాన్ని పంపాయి..