ముగ్గురి ప్రాణాలు బలిగొన్న కలుషితాహారం

ముగ్గురి ప్రాణాలు బలిగొన్న కలుషితాహారం

తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. తిరుప్పూర్లోని ఓ చిల్డ్రన్స్ హోంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిన్న ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. 11 మంది తీవ్ర అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలయ్యారు. 

బుధవారం రాత్రి భోజనంలో బాలురు రసం, అన్నం, లడ్డూ తిన్నారు. భోజనం చేసిన కాసేపటికి కొందరు చిన్నారులు వాంతులు చేసుకున్నారు. గురువారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన అనంతరం వారి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. కొందరు స్పృహ తప్పి పడిపోవడంతో చిల్డ్రన్ హోం నిర్వాహకులు హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ ముగ్గురు చిన్నారులు చనిపోయారు. మిగిలిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ట్రీట్మెంట్ అందిస్తున్నారు.

ఫుడ్ పాయిజన్ గురించి తెలుసుకున్న తిరుప్పూర్ జిల్లా కలెక్టర్ వినీత్ హాస్పిటల్కు వెళ్లి పిల్లలను పరామర్శించారు. చిన్నారులకు అందిస్తున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు చిల్డ్రన్ హోంలో వారు తిన్న ఆహారాన్ని అధికారులు పరీక్షల కోసం పంపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నరు.