
- కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్
హనుమకొండ, వెలుగు: ఈ నెల 16న నిర్వహించనున్న శ్రీ కృష్ణాష్టమి వేడుకలను సక్సెస్ చేయాలని మాస్టర్ జీ విద్యాసంస్థల అధినేత, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ పిలుపునిచ్చారు. హనుమకొండ రాంనగర్ లోని బీసీ భవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకృష్ణుడి చరితను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మూడేండ్లుగా హనుమకొండలో జన్మాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 16న కృష్ణాష్టమి సందర్భంగా హనుమకొండలో వందలాది మంది కళాకారులతో శోభాయాత్ర ఉంటుందన్నారు.
అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో సంబరాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర మంత్రి కొండా సురేఖతోపాటు స్థానిక ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఇతర ప్రముఖులు, సింగర్స్ హాజరవుతున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో యాదవ సంఘం నాయకులు కన్నెబోయిన రాజయ్య, గీరబోయిన రాజయ్య, అశోక్, రాజేందర్, కుమార్, రజిని, సిద్దిరాజు, బోయిన భిక్షపతి, బొంగు రాజు, సూర ప్రమోద్ కుమార్, నలిగేటి అనిల్ తదితరులు పాల్గొన్నారు.