ఇండ్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం సరికాదు

ఇండ్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం సరికాదు

మరికల్​, వెలుగు : ఇండ్లు కూలగొడతారని ఎవరూ అధైర్యపడకండి.. మీకు అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్​రెడ్డి బాధితులకు భరోసా ఇచ్చారు. శుక్రవారం మరికల్‌ మండలం పల్లెగడ్డ గ్రామంలో దేవదాయ శాఖకు సంబంధించిన జాగలో ఇండ్లు కట్టుకున్నవారు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేయడం సరికాదన్నారు. ఏండ్ల కింద ఇండ్లు కట్టుకున్నారని, ప్రభుత్వానికి ఇంటి పన్ను, కరెంట్​బిల్లులు చెల్లిస్తున్నారని, ఇప్పుడు నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.