
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం వీలైనంత వరకు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నదని పార్టీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. కొన్ని సార్లు సమస్యలు పరిష్కరించడం లేట్ కావొచ్చని ట్విట్టర్లో చెప్పారు. ‘మా సమస్య రాములమ్మ పరిష్కరిస్తదని కొందరు నాకు వినతిపత్రాలు ఇస్తున్నారు. వారందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. నా దృష్టికి వచ్చినవి.. నేను పరిష్కరించేవి ఏమైనా ఉంటే కచ్చితంగా బాధితులకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఎప్పటికీ మీ వెన్నంటి ఉంటాను’’అని విజయశాంతి స్పష్టం చేశారు.