ఖమ్మంలో ఇందిరమ్మ ఇండ్ల స్థలాలకు శంకుస్థాపన

ఖమ్మంలో ఇందిరమ్మ ఇండ్ల స్థలాలకు శంకుస్థాపన

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మంలోని  26వ డివిజన్ లో ఇందరిమ్మ ఇండ్ల నిర్మాణానికి నగర మేయర్  పునుకొల్లు నీరజ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హలైన నిరుపేద కుటుంబాలకు సొంతిటి కల తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో నగర నాయకులు బుజ్జి, సరిత, ప్రసాద్, యాకూబ్, మదర్,శ్రీను పాల్గొన్నారు.