మంత్రి శ్రీధర్ బాబు ఆశీస్సులతోనే టికెట్ వచ్చింది: గడ్డం వంశీకృష్ణ

మంత్రి  శ్రీధర్ బాబు ఆశీస్సులతోనే టికెట్ వచ్చింది:  గడ్డం వంశీకృష్ణ

మంత్రి శ్రీధర్ బాబు ఆశీర్వాదంతోనే తనకు పెద్దపల్లి టికెట్ వచ్చిందని కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. కాకా వెంకటస్వామి చేసిన సేవలను తాను కొనసాగిస్తానని చెప్పారు.  తనను పార్లమెంటు సభ్యుడిగా గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. తనకు మద్దతుగా నిలిచిన మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  తాను 2004లో మొదటి సారి మంత్రి శ్రీధర్ బాబును కలిశానని, అప్పుడే ఆయనతో ‘మీరే నా రోల్ మోడల్’ అని చెప్పానని వంశీకృష్ణ అన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే కచ్చితంగా కష్టపడి పనిచేస్తానని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు.

పెద్దపల్లిని మరింత అభివృద్ది చేస్తం :  ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కాకా వెంకటస్వామి ప్రజల కోసం పనిచేశారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి అన్నారు. తమ కుటుంబం ప్రజాసేవకు అంకితమైందని చెప్పారు. గడ్డం వంశీకృష్ణను ఎంపీగా గెలిపిస్తే పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ ను మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు.   

తెలంగాణ ఏర్పాటులో కాకా ఫ్యామిలీ కీలకం :   ఎమ్మెల్యే లక్షణ్ కుమార్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాకా కుటుంబం కీలకంగా వ్యవహరించిందని చెప్పారు. కాకా మనుమడు రాజకీయాల్లోకి రావడం సంతోషకరమని అన్నారు. ఏఐసీసీ వంశీకృష్ణకు పెద్దపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిందని చెప్పారు. వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పారు.  సింగరేణి కార్మికులకు కాకా ఎంతో సేవచేశారని అన్నారు. ప్రతి ఓటరును కలిసి వంశీని గెలిపిస్తామని చెప్పారు.