గద్వాల, వెలుగు: స్టూడెంట్లు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు టీచర్లు టెక్నాలజీపై అవేర్నెస్ పెంచుకోవాల్సిన అవసరం ఉందని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలో విద్యాశాఖ యాప్ లు, వివిధ పోర్టల్ లపై జిల్లాలోని ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, నాన్ టీచింగ్ ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏఐ, ఇతర టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ప్రతి ఒక్కరూ ముందుండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. టెన్త్ ఫలితాల్లో మెరుగైన స్థానాన్ని దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలన్నారు. డీఈవో విజయలక్ష్మి, సెక్టోరియల్ ఆఫీసర్లు శాంతిరాజు, అంపయ్య పాల్గొన్నారు.
