గద్వాల టౌన్, వెలుగు: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని జిల్లా వ్యయ పరిశీలకులు రాజేశ్ బాబు తెలిపారు. గురువారం కలెక్టరేట్ లో ఏఈఓలకు సర్పంచ్ ఎన్నికల వ్యయంపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తాను నామినేషన్ వేసిన తేదీ నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించేంత వరకు ఎన్నికల్లో ఖర్చుపెట్టిన వివరాలను అందజేయాల్సి ఉంటుందని చెప్పారు. అనంతరం మాస్టర్ ట్రైనర్స్ వ్యయానికి సంబంధించి వివిధ అంశాలను వివరించారు. ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి రమేశ్ బాబు, జిల్లా నోడల్ అధికారి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
