గేమ్ ఛేంజర్ మూవీ అప్డేట్.. క్రేజీ క్యారెక్టర్స్ లో రామ్ చరణ్?

గేమ్ ఛేంజర్ మూవీ అప్డేట్.. క్రేజీ క్యారెక్టర్స్ లో రామ్ చరణ్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) కాంబోలో  వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్(Game changer). పాన్ ఇండియా రేంజ్లో వస్తున్న ఈ మూవీ  కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రీసెంట్ రిలీజ్ చేసిన పోస్టర్, టైటిల్‌ టీజర్ ఎంతగా ట్రెండ్ అయ్యాయో అందరికీ తెలిసేందే. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీలో రామ్ చరణ్ రెండు భిన్నమైన క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నారని మౌత్ టాక్ బాగా వినిపిస్తోంది. అది కూడా రెండు టైమ్ లైన్స్ లో, తండ్రి కొడుకులుగా ఈ క్యారెక్టర్స్ ఉంటాయంట. తండ్రి పేరు అప్పన్న కాగా.. ఆ పాత్ర ఒక పొలిటీకల్ లీడర్ గా ఉండబోతోందని తెలుస్తోంది. సొసైటీ లో మార్పు కోసం పరితపించే నాయకుడి తరహాలో ఆ క్యారెక్టర్ ని రిప్రజెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ కి సంబందించి కటౌట్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

అలాగే కొడుకు రామ్ నందన్ కుమార్ గా చరణ్..యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య స్టోరీ ఏమీ ఉండదని..ఫ్లాష్ బ్యాక్ లో లీడర్ అప్పన్న క్యారెక్టర్ ఉంటుందని సమాచారం. ఈ అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతోన్నారు. శంకర్ డైరెక్షన్  లో హీరోస్ ఎంత నిజాయితీగా కనిపిస్తారో జెంటిల్ మెన్, ప్రేమికుడు, భార‌తీయుడు, జీన్స్, ఒకే ఒక్క‌డు, ప్రేమిస్తే,అపరిచితుడు మూవీస్ తో  చూశాం.ఇక రామ్ చరణ్ ను చూడటానికి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 

ALSO READ :సోది సినిమా అన్నారు.. కట్ చేస్తే రూ.210 కోట్లు కలెక్ట్ చేసింది.

ఇప్పటికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ మిగిలిన షూటింగ్ కూడా నవంబర్ నాటికి..ఫినిష్ చేసే ప్లాన్ లో శంకర్ ఉన్నట్టు టాక్. ఇక ఈ మూవీ నుండి త్వరలో మరో అప్డేట్ రానుందని తెలుస్తోంది. ఆగస్టు 15న టీజర్(Game Changer Teaser) రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. టీజర్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ ని కూడా ప్రకటిస్తారని సమాచారం. 

ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ( Kiara Advani )హీరోయిన్ గా నటిస్తుండగా.. తమన్(Thaman) సంగీతం అందిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో అంజలి, ఎస్ జే సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.  దిల్ రాజు(Dil Raju) ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నారు.