
సోది సినిమా.. పెద్ద తలనొప్పి.. అసలిది సినిమానా.. సీరియల్ లా ఉంది.. వారం క్రితం వరకు రాఖీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహాని మీద ఆడియన్స్ చేసిన కామెంట్స్ ఇది. కానీ అనూహ్యంగా పంజుకున్న ఈ సినిమా.. ఆ నెగెటివిటీని దాటుకుని మరీ వందల కోట్లు రాబడుతోందీ. తాజాగా ఈ మూవీ రూ.210 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలకు షాకిచ్చింది.
దీంతో ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకనిర్మాత కరణ్ జోహార్ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేశాడు. రాఖీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహాని మూవీ రిలీజ్‌కు ముందు చాలా భయపడ్డాను. దానికి కారణం ఏంటా అనేది కూడా క్లారిటీగ చెప్పలేను. నిజానికి బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడు? ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో అస్సలు ఊహించలేం. కానీ జూలై 28 శుక్రవారంతో ఆ భయానికి ఎండ్ కార్డు పడింది. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు కరణ్.
ALSO READ :గేమ్ ఛేంజర్ మూవీ అప్డేట్.. క్రేజీ క్యారెక్టర్స్ లో రామ్ చరణ్?
ఇక రాఖీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహాని సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించారు. జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు.. మొదట నెగిటీవ్ టాక్ వచ్చింది. ఈ సినిమాను చాలా దారుణంగా ట్రోల్ చేశారు నెటిజన్స్. రివ్యూస్ కూడా చాలా బ్యాడ్ గా వచ్చాయి. కానీ వాటన్నింటిని పక్కకు నెట్టేసి రికార్డ్స్ కలెక్షన్స్ రాబడుతోంది ఈ సినిమా. అంతేకాదు రోజురోజుకి పెరుగుతున్న కలెక్షన్స్ తో ఫుల్ ఖుషీలో ఉన్నారు చిత్ర యూనిట్.