మల్కాజిగిరి, వెలుగు: ఘట్కేసర్లో గౌరక్షక్ సేవకుడు ప్రశాంత్ పై కాల్పులు జరిపిన నిందితులను 24 గంటల్లో పట్టుకున్నందుకు సోమవారం రాచకొండ సీపీ సుధీర్ బాబుకు గౌరక్షక్ సభ్యులు రావుల శ్రీకాంత్ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. ముగ్గురు నిందితులను పట్టుకొని కోర్టులో హాజరు పర్చడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
