సరస్వతీ పుష్కరాల్లో..పుణ్యస్నానం చేసిన గవర్నర్ దంపతులు

సరస్వతీ పుష్కరాల్లో..పుణ్యస్నానం చేసిన గవర్నర్ దంపతులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతీ పుష్కరాల్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొన్నారు. గవర్నర్ కు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు ఘన స్వాగతం పలికారు. త్రివేణి సంగమం దగ్గర గవర్నర్ దంపతులు  పుష్కర స్నానం ఆచరించారు.అనంతరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. 

7 కి.మీ ట్రాఫిక్ జామ్

మరో వైపు  కాళేశ్వరం పుష్కరాలు రేపటితో ముగియనుండటంతో ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివస్తున్నారు. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. అనాలోచితంగా ట్రాఫిక్‌ను అడవిలోకి మళ్లించారు పోలీసులు. దీంతో 7 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి . ఎటు వెళ్ళలేక 5గంటలుగా అడవిలో ఇబ్బందులు పడుతున్నారు భక్తులు. ఇవాళ దాదాపు 5 లక్షల వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనావేస్తున్నారు.