స్టూడెంట్స్ కు మెనూ ప్రకారం భోజనం అందించాలి : వెంకట్రెడ్డి

స్టూడెంట్స్ కు  మెనూ ప్రకారం  భోజనం అందించాలి : వెంకట్రెడ్డి
  • హనుమకొండ జిల్లా అడిషనల్​ కలెక్టర్​ వెంకట్​రెడ్డి

శాయంపేట(దామెర), వెలుగు: గవర్నమెంట్​ హాస్టల్స్​, స్కూళ్లలో చదివే స్టూడెంట్స్​కు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని హనుమకొండ జిల్లా అడిషనల్​ కలెక్టర్​వెంకట్​రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్​లోని ఎంజేపీ, మైనారిటీ, సాంఘిక  సంక్షేమ గురుకుల స్కూల్, కాలేజీ​లను అడిషనల్​ కలెక్టర్​ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా స్కూళ్లలో స్టోర్​ చేసిన  కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులను, స్టోర్​రూంను పరిశీలించారు. మెనూ ప్రకారం స్టూడెంట్స్​ భోజనం అందిస్తున్నారా అని స్టూడెంట్స్​ను అడిగి తెలుసుకున్నారు.  

నషా ముక్త్​ భారత్​ అభియాన్​ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల నిర్మూలన, వాటి నియంత్రణ చర్యలపై  విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.  కార్యక్రమంలో ఆయా స్కూల్​, కాలేజ్​  ప్రిన్సిపాల్‌‌‌‌లు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.