ఆస్పత్రి నుంచి బాలకృష్ణ డిశ్చార్జ్

ఆస్పత్రి నుంచి బాలకృష్ణ డిశ్చార్జ్

హైదరాబాద్: హీరో నందమూరి బాలకృష్ణ ఆస్పత్రి నుంచి ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. ఆరు నెలలుగా భుజం నొప్పితో బాధపడుతున్న ఆయన గత అక్టోబర్ 31వ తేదీన బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో చేరారు. వేధిస్తున్న ఈ భుజం నొప్పికి ఆస్పత్రి వైద్యులు డాక్టర్ రఘువీరారెడ్డి, డాక్టర్ బీఎన్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆపరేషన్ చేశారు. సుమారు 4గంటలకుపైగా జరిగిన ఆపరేషన్ అనంతరం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిపోయారు బాలకృష్ణ.