ద్వైపాక్షిక మహాసభలను సక్సెస్ చేయండి

ద్వైపాక్షిక మహాసభలను సక్సెస్ చేయండి

నస్పూర్, వెలుగు: శ్రీరాంపూర్‌‌‌‌‌‌ ఏరియాలో నిర్వహించే 26వ ద్వైపాక్షిక మహాసభలను విజయవంతం చేయాలని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పారపు సారయ్య పిలుపునిచ్చారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్​లో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 30, 31న శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి గోదావరి ఫంక్షన్ హాల్​లో నిర్వహిస్తున్న మహాసభలను సింగరేణి వ్యాప్తంగా ఉన్న గని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సక్సెస్ చేయాలన్నారు. కొత్త గనుల ఏర్పాటు కోసం జాతీయ సంఘాలు ముందుకు రావాలని, కేంద్రంపై ఓత్తడి తీసుకువచ్చి గనులను సాధించుకోవాలన్నారు. 

ఏరియాలోని ఆర్కే6 గనిలో బొగ్గు నిల్వలు ఉన్నా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోకుండా మూసివేశారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు సింగరేణికి కొత్త గనులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. కొత్త గనులు లేకుంటే సింగరేణి మనుగడ కష్టమ న్నారు. వేలంపాటలో పాల్గొనకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. హెచ్ఎంఎస్ మహాసభలో కార్మికుల ఆత్మ గౌరవం, హక్కుల సాధన, సంస్థ పరిరక్షణ, అవినీత నిర్మూలన, కొత్త భూగర్భ గనుల సాధన వంటి అనేక సమస్యలపై చర్చిస్తారమని తెలిపారు. సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు జి.సత్యనారాయణ, పి.అశోక్, రాజేంద్రప్రసాద్, అశోక్, లక్ష్మణ్, బాలయ్య, శ్రీనివాస్, వినయ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.