- ఫొటో తీసి 9000113667
- నంబర్‌కు వాట్సాప్ చేయండి
- నగరవాసులకు హైడ్రా విజ్ఞప్తి
హైదరాబాద్ సిటీ, వెలుగు: బెంగళూరులో వర్షం పడి గోడ కూలి ఏడుగురు చనిపోయిన ఘటనతో హైడ్రా అప్రమత్తమైంది. దీంతో నగరంలో అటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలకు సిద్ధమైంది. పాతబడ్డ ఇండ్లు, కూలిపోయేటట్లున్న గోడలుంటే 9000113667 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరింది. ప్రమాదకరమైన బిల్డింగులు, గోడలు ఉంటే ఫొటో తీసి, కరెంట్ లొకేషన్ వాట్సాప్‌ద్వారా షేర్చేయాలని విజ్ఞప్తి చేసింది. సమాచారం ఇచ్చిన వారి వివరాలను సీక్రెట్‌గా ఉంచుతామని స్పష్టం చేసింది. ఇప్పటికే మున్సిపల్ అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని, ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరింది.
