లైవ్ డిబేట్లోనే తన్నుకున్నారు... వీడియో వైరల్

లైవ్ డిబేట్లోనే  తన్నుకున్నారు... వీడియో వైరల్

పాకిస్తాన్ లో వేర్వేరు రాజకీయ పార్టీలకు  చెందిన ఇద్దరు నేతలు లైవ్ డిబేట్లోనే ఘర్షణకు దిగారు. -ఓ న్యూస్ ఛానల్  డిబేట్లో  పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పిఎంఎల్-ఎన్)కి చెందిన సెనేటర్ అఫ్నాన్ ఉల్లా ఖాన్‌, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ)నేత, లాయర్ అఫ్జల్ ఖాన్ మార్వాత్ మాట్లాడుతూ ఉండగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.  

ఇమ్రాన్ ఖాన్ ను ..  అఫ్నాన్  దుర్భాషలాడడటంతో  మార్వాత్ అతనిపై చేయి చేసుకున్నాడు.  ఆ తరువాత ఇద్దరు నేలపై పడేసుకుని, తన్నుకోవడం, కొట్టుకోవడం  ప్రారంభించారు.   చివరకు  ఛానల్ సిబ్బంది జోక్యం చేసుకుని గొడవను ఆపారు.  దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  నిమిషం కంటే ఎక్కువ నిడివి ఉన్న ఆ వీడియో లక్ష దాక వ్యూస్ పొందింది.

 ఘటన తర్వాత...  అఫ్నాన్ ట్విట్టర్ ల లో దీనికి సంబంధించిన వివరాలు షేర్ చేశారు.  "నిన్న జరిగిన టాక్ షోలో మార్వాట్ నాపై దాడి చేసాడు, నేను అహింసను నమ్ముతాను కానీ నేను నవాజ్ షరీఫ్ సైనికుడిని. మార్వాత్‌ ఎలాంటి ట్రిక్ చేశాడో.. అన్ని PTI లకు, ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్‌కు ఒక గుణపాఠం, వారు ఏదీ అంగీకరించరు. కనిపించకుండా పెద్ద నల్ల అద్దాలు ధరించారే ”అని ఖాన్ పోస్ట్ చేశాడు.