
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రత్యేక సంస్థ అయిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) నేచర్ మెడిసిన్‌లో వచ్చిన ఒక రీసర్చ్ వార్త తీవ్రమైన హెచ్చరిక చేసింది. ఇందులో ప్రపంచం మొత్తం గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కేసులలో పెరుగుదల చూస్తుంది, ముఖ్యంగా భారతదేశం. ఈ అధ్యయనంలో 2008 నుండి 2017 మధ్య జన్మించిన వారిని పరీక్షించగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ తరంలో కోటిన్నర మందికి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ప్రమాదం ఉందని అంచనా వేసింది. అయితే ఈ కేసుల్లో దాదాపు మూడింట రెండు వంతులు ఆసియాలో కాగా, దీనికి కారణం అధిక జనాభా అలాగే ఇతర కారణాలను పేర్కొంది.
భారతదేశం, చైనాలో : భారతదేశం, చైనాలలో దాదాపు 65 లక్షల కొత్త కడుపు క్యాన్సర్ కేసులు రావచ్చని ఈ అధ్యయనం చెబుతోంది. జనాభా పెరగడం, సరైన పారిశుద్ధ్యం లేకపోవడం, మంచి వైద్యం లేకపోవడం, కొన్ని రకాల ఆహారపు అలవాట్లు వంటి కారణాల వల్ల ఈ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. అయితే తగిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో భారతదేశంలో కడుపు క్యాన్సర్ పెద్ద ఆరోగ్య సమస్యగా మారే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
హెలికోబాక్టర్ పైలోరీ (H. pylori ) కారణం: కడుపు క్యాన్సర్ కేసులలో దాదాపు 76% హెలికోబాక్టర్ పైలోరీ (H. pylori ) అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందని ఈ అధ్యయనం తెలిపింది. ఈ బ్యాక్టీరియా కడుపులో ఉండి సంవత్సరాలుగా బయటపడకుండా ఉంటుంది. తరువాత మెల్లిగా చివరకు క్యాన్సర్‌కు దారితీస్తుంది. భారతదేశంలో ఈ H.pylori గురించి తెలియకపోవడం, పరీక్షలు లేకపోవడం వల్ల చాలామందికి ట్రీట్మెంట్ అందడం లేదు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే ఇన్ఫెక్షన్‌ను గుర్తించి త్వరగా వైద్యం అందించడం అవసరం.
ముందే గుర్తిస్తే క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చు: H. pyloriని ముందే గుర్తించి వైద్యం చేస్తే, భవిష్యత్తులో వచ్చే కడుపు క్యాన్సర్ కేసులను 75% వరకు తగ్గించవచ్చని పరిశోధన చెబుతోంది. భారతదేశం వంటి దేశాల్లో తక్కువ ఖర్చుతో ప్రజలందరికీ టెస్టులు అందుబాటులోకి తేవడం చాలా ముఖ్యం. H.pylori వైద్యంకి యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేసి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా ప్రాణాలను కాపాడవచ్చు.
యువతలోనూ పెరుగుతున్న ప్రమాదం: అధ్యయనంలో ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, కడుపు క్యాన్సర్ ఇప్పుడు యువతను ముఖ్యంగా 2008 తర్వాత పుట్టిన వారిని ఎక్కువగా ప్రభావం చేస్తోంది. గతంలో ఈ వ్యాధి ఎక్కువగా వృద్ధులకే వచ్చేది. భారతదేశంలో వృద్ధ జనాభా కూడా పెరుగుతున్నందున యువతలో, వృద్ధులలోనూ క్యాన్సర్ చికిత్సకు అవసరాలు పెరుగుతాయి.
భారతదేశంలోనే 16 లక్షలకు పైగా కొత్త కడుపు క్యాన్సర్ కేసులు రావచ్చని అంచనా వేయగా, దీనికి నివారణ చాలా అవసరమని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. అయితే స్క్రీనింగ్ ముందే గుర్తించడం, ఆరోగ్య విద్యలో పెట్టుబడులు పెట్టడం వల్ల లక్షల మరణాలను నివారించవచ్చు. భారతదేశం ఇప్పుడు చర్య తీసుకుంటే, ఈ క్యాన్సర్ ఒక పెద్ద అంటువ్యాధిగా మారకుండా నిరోధించవచ్చు.