
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా వైట్ బాల్ సిరీస్ కు గాయం కారణంగా దూరమయ్యాడు. ఆసియా కప్ లో ఫైనల్ కు ముందు మోకాలి గాయంతో ఇబ్బంది పడిన పాండ్య పాకిస్థాన్ తో జరిగిన తుది సమరానికి దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఆసీస్ సిరీస్ కు దూరమయ్యాడు. తాజా సమాచారం ప్రకారం ఈ టీమిండియా ఆల్ రౌండర్ పూర్తిగా కోలుకున్నట్టు తెలుస్తోంది. సర్జరీ నుంచి తప్పించుకున్న పాండ్య త్వరలోనే భారత జట్టులోకి రానున్నాడు. వచ్చే నెలలో సౌతాఫ్రికాతో జరగబోయే వైట్ బాల్ సిరీస్ కు పాండ్య అందుబాటులో ఉంటాడు.
నవంబర్ చివరి నాటికి పూర్తి ఫిట్‌నెస్‌లోకి తిరిగి రావాలనే లక్ష్యంతో పాండ్యా రాబోయే నాలుగు వారాలు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో గడపాలని భావిస్తున్నాడు. ఈ ప్రీమియర్ ఆల్ రౌండర్ కు క్వాడ్రిసెప్స్ గాయానికి శస్త్రచికిత్స అవసరం లేదని బీసీసీఐ వైద్య బృందం క్లారిటీ ఇవ్వడంతో టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియాకు బిగ్ రిలీఫ్ లభించింది. హార్దిక్ గత వారంలో బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో గడిపాడు. దీపావళికి కొంత విరామం తీసుకొని బుధవారం (అక్టోబర్ 22) తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించినట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. సౌతాఫ్రికా సిరీస్ కు అందుబాటులో ఉండాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాడు.
సౌతాఫ్రికాతో మూడు ఫార్మాట్ లు:
నవంబర్- డిసెంబర్ నెలలో సౌతాఫ్రికా ఇండియాలో పర్యటిస్తుంది. మూడు ఫార్మాట్ లలో టీమిండియా.. సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ సుదీర్ఘ టూర్ లో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ లు జరుగుతాయి. నవంబర్ 14 నుంచి 18 వరకు తొలి టెస్ట్ న్యూఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో.. నవంబర్ 22 నుంచి 26 వరకు గౌహతి వేదికగా బర్సపారా క్రికెట్ స్టేడియంలో రెండో టెస్ట్ జరుగుతుంది. నవంబర్ 30 న తొలి వన్డే.. డిసెంబర్ 3 న రెండో వన్డే.. డిసెంబర్ 6 న మూడో వన్డే జరుగుతుంది.
►ALSO READ | IND vs AUS: అడిలైడ్‌లో ఆస్ట్రేలియా, ఇండియా రెండో వన్డే.. లైవ్ స్ట్రీమింగ్, టైమింగ్, స్క్వాడ్ వివరాలు!
తొలి మూడు వన్డేలకు వరుసగా రాంచీ, రాయ్‌పూర్,విశాఖపట్నం ఆతిధ్యమిస్తాయి. డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 19 వరకు మొత్తం 5 టీ 20 మ్యాచ్ లు జరుగుతాయి. డిసెంబర్ 9 న కటక్ వేదికగా తొలి టీ20.. డిసెంబర్ 11 న్యూ చండీగఢ్ వేదికగా రెండో టీ20.. డిసెంబర్ 14 న ధర్మశాల వేదికగా మూడో టీ20.. డిసెంబర్ 17న లక్నో వేదికగా నాలుగో టీ20.. డిసెంబర్ 19న అహ్మదాబాద్ లో ఐదో టీ20 జరుగుతాయి. వన్డే మ్యాచ్ లో మధ్యాహ్నం 1:30 నిమిషాలకు.. టీ20 మ్యాచ్ లు రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతాయి.