IND vs AUS: అడిలైడ్‌లో ఆస్ట్రేలియా, ఇండియా రెండో వన్డే.. లైవ్ స్ట్రీమింగ్, టైమింగ్, స్క్వాడ్ వివరాలు!

IND vs AUS: అడిలైడ్‌లో ఆస్ట్రేలియా, ఇండియా రెండో వన్డే.. లైవ్ స్ట్రీమింగ్, టైమింగ్, స్క్వాడ్ వివరాలు!

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం (అక్టోబర్ 23)రెండో వన్డే ప్రారంభం కానుంది. అడిలైడ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో ఆతిధ్య ఆస్ట్రేలియా ఫేవరేట్ గా బరిలోకి దిగనుంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో విజయం సాధించి ఊపు మీదున్న ఆస్ట్రేలియా రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్ గెలవాలని భావిస్తోంది. మరోవైపు గిల్ కెప్టెన్సీలోని ఇండియా ఎలాగైనా రెండో వన్డేలో గెలిచి సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కు రెండు జట్ల స్క్వాడ్, టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇప్పుడు చూద్దాం..       

టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్టింగ్ వివరాలు:

భారత కాలమానం ప్రకారం ఇండియా, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. టాస్ ఉదయం 8:30 గంటలకు వేస్తారు.  

లైవ్ టెలికాస్ట్:  స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ మూడు వన్డేలను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది

లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా యాప్, వెబ్‌సైట్ లో ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది.

రెండో వన్డేకు ఇండియా స్క్వాడ్: 

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్, యశస్వి జైస్వాల్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ 

ఇండియాతో రెండో వన్డేకు ఆస్ట్రేలియా స్క్వాడ్:

మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మాట్ రెన్షా, కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, బెన్ డ్వార్షుయిస్, మార్నస్ లాబుస్చాగ్నే, జేవియర్ బార్ట్‌లెట్

►ALSO READ | ఐసీసీ దగ్గరే తేల్చుకుంటం: ఆసియా కప్ టైటిల్ వివాదంపై BCCI కీలక నిర్ణయం

అడిలైడ్ ఓవల్ పిచ్ రిపోర్ట్:

అడిలైడ్ ఓవల్‌లోని పిచ్ బ్యాటింగ్ కు స్వర్గధామం. పెర్త్ లో లాగ బౌన్సీ వికెట్ ఇక్కడ ఉండదు. వికెట్ ఫ్లాట్ గా ఉంటుంది. బ్యాటర్లు పరుగుల వరద పారించవచ్చు. అయితే ఈ పిచ్ స్పిన్నర్లకు బాగా అనుకూలించే అవకాశాలు ఉన్నట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇండియాలో స్పిన్నర్లు ఈ మ్యాచ్ లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి.