2075 నాటికి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

2075 నాటికి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

2075 నాటికి దేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని గోల్డ్‌మన్ సాక్స్ పరిశోధన కనుగొంది. ఈ నివేదిక ప్రకారం భారతదేశ ఆర్థిక వ్యవస్థ విలువ $52.5 ట్రిలియన్లు సాధించి, అమెరికాను సైతం దాటేయనుంది. ఇది చైనా తర్వాతి స్థానంలో నిలవనుందని నివేదిక అంచనా వేసింది.

1.4 బిలియన్ల జనాభా గల భారతదేశం జర్మనీ, జపాన్‌, చైనా, యుఎస్‌ల తర్వాత భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ”రాబోయే రెండు దశాబ్దాలలో, భారతదేశ డిపెండెన్సీ రేషియో ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలలో అత్యల్పంగా ఉంటుంది” అని గోల్డ్‌మన్‌ సాక్స్‌ రీసెర్చ్‌ యొక్క భారతదేశ ఆర్థికవేత్త శంతను సేన్‌గుప్తా అన్నారు. అందుకు రోజురోజుకూ పెరుగుతున్న జనాభా సామర్థ్యాన్ని వెలికితీయడం, శ్రామిక శక్తిలో భాగస్వామ్యాన్ని పెంపొందించడం, అపారమైన ప్రతిభకు శిక్షణ, నైపుణ్యాలను అందించడం కీలకమని సేన్‌గుప్తా చెప్పారు. వచ్చే 20 ఏళ్లలో పెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం అత్యల్ప డిపెండెన్సీ నిష్పత్తులలో ఒకటిగా ఉంటుందని కూడా ఆయన అంచనా వేశారు. ”తయారీ సామర్థ్యాన్ని నెలకొల్పడం, సేవలను పెంచడం, మౌలిక సదుపాయాల వృద్ధిని కొనసాగించడం వంటి అంశాలలో భారతదేశం సరైన అవకాశాలు పొందడానికి అనుగుణంగా ఉంటుంది” అని సేన్‌గుప్తా చెప్పారు.

As India’s population of 1.4 billion people becomes the world’s largest, its GDP is forecast to expand dramatically. Goldman Sachs Research projects India will have the world’s second-largest economy by 2075. https://t.co/CFFM0JsmEL pic.twitter.com/xHruyuSFex

— Goldman Sachs (@GoldmanSachs) July 6, 2023