ఇటుక లేకుండా ఇందిరమ్మ ఇల్లు..మద్దూరు మండలం మోమిన్‌‌పూర్‌‌లో నిర్మాణం

 ఇటుక లేకుండా ఇందిరమ్మ ఇల్లు..మద్దూరు మండలం మోమిన్‌‌పూర్‌‌లో నిర్మాణం

మద్దూరు, వెలుగు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నారాయణపేట జిల్లాలో ఇటుక లేకుండా ఇల్లు కట్టేలా సరికొత్త టెక్నాలజీని వాడుతున్నారు. సీఎం రేవంత్‌‌రెడ్డి సొంత నియోజకవర్గంలోని మద్దూరు మండలం మొమిన్‌‌పూర్‌‌లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.

 ఇందులో భాగంగా మొదట మూడు ఇండ్లకు ముగ్గు పోసి, కేవలం సిమెంట్, కంకర, స్టీల్‌‌తోనే గోడలు నిర్మిస్తున్నారు. కాంక్రీట్‌‌ మిక్సర్‌‌ మెషీన్‌‌, ఆర్‌‌ఎంసీ అందుబాటులో ఉంటే కేవలం 20 రోజుల్లో ఇల్లు పూర్తవుతుందని పీఏసీఎస్ చైర్మన్‌‌ నర్సింహులు తెలిపారు. సీఎం రేవంత్‌‌రెడ్డి, ఇన్‌‌చార్జి తిరుపతిరెడ్డి కృషితో తమ గ్రామంలో సరికొత్త టెక్నాలజీని వాడడం ఆనందంగా  ఉందన్నారు.