- మెట్ పల్లి ఖాదీ కాంప్లెక్స్ నిర్మాణాల్లో అవకతవకలపై ఎంక్వైరీ చేయాలి
- మెట్ పల్లి ఆర్డీవో కు కాంగ్రెస్ నాయకుల వినతి
మెట్ పల్లి, వెలుగు: మెట్ పల్లి ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్ఠాన్ చైర్మన్, కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అండ దండలతోనే ఖాదీ కాంప్లెక్స్ నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని, కాంగ్రెస్ నాయకులు ఎర్రోళ్ల హన్మాండ్లు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఖాదీ ఆవరణలో కాంప్లెక్స్ కడుతున్నామని ప్రజల నుంచి రూ. లక్షలు అడ్వాన్స్ గా తీసుకొని నాసిరకంగా రూములు నిర్మించారని ఆరోపించారు. నిర్మాణ పనుల్లో ఖర్చు చేసిన నిధుల్లో అవకతవకలు జరిగాయన్నారు.
ఖాదీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, సంబంధిత కాంట్రాక్టర్ పై సీబీసీఐడీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డబ్బులు రికవరీ చేయాలని కోరారు. అనంతరం ఆర్డీవో శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ యామ రాజయ్య, ఎండీ రైసుద్దీన్, సంగు గంగాధర్, పొన్నాల యల్లేశ్, అంబటి హన్మాండ్లు,కృష్ణమూర్తి, పల్లికొండ ప్రవీణ్, అంజిరెడ్డి, రాజరెడ్డి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.