ఓటీటీలోకి.. రాధే శ్యామ్: స్ట్రీమింగ్ అప్పటి నుంచే!

ఓటీటీలోకి.. రాధే శ్యామ్: స్ట్రీమింగ్ అప్పటి నుంచే!

రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ సినిమా ఓటీటీలో రాబోతోంది. ఏప్రిల్ ఒకటిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాధే శ్యామ్ అందుబాటులోకి రాబోతోంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అఫీషియల్ గా ట్వీట్ చేసింది. మ్యూజిక్, విజువల్స్ కొన్ని కోణాల్లో రాధే శ్యామ్ ఆకట్టుకున్నా..డివైడ్ టాక్ రావడంతో.. ఈ మూవీ థియేటర్లోంచి త్వరగానే వెళ్లిపోవాల్సి వచ్చింది. మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో రాధేశ్యామ్ థియేటర్స్ నుంచి ఔట్ అయ్యింది.  అందుకే ఈ సినిమాను త్వరగానే ఓటీటీలోకి విడుదల చేయబోతోన్నారు. ఏప్రిల్ ఒకటిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో రాబోతోంది. మొత్తానికి రాధే శ్యామ్ మాత్రం నెల రోజులు తిరక్కుండానే ఓటీటీలోకి వస్తోంది. మామూలుగా ఇలాంటి పెద్ద సినిమాలు కనీసం ముప్పై రోజుల వ్యవధిలో వస్తుంటాయి. లేదంటే యాభై రోజుల తరువాత అయినా వస్తాయి. కానీ ఈ సినిమాకు వచ్చిన టాక్, కలెక్షన్ల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. మార్చి 11న రాధే శ్యామ్ థియేటర్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. నెల రోజులు కాకముందే అంటే ఏప్రిల్ -1న ఓటీటీలోకి రాధే శ్యామ్ వస్తోంది.

ఇండియాపై సౌతాఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీపై ఐసీసీ వీడియో

యాదాద్రి పునః ప్రారంభం.. కేసీఆర్ ప్రత్యేక పూజలు

చిల్లరతో రెండున్నర లక్షల బైక్ కొన్నడు

భార్యపై జోక్.. చెంప చెళ్లుమనిపించిన హాలీవుడ్ హీరో