శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘హిట్ 2’

శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘హిట్ 2’

అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘హిట్ 2’. ద సెకెండ్ కేస్‌‌‌‌‌‌‌‌ ట్యాగ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌తో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నాని సమర్పణలో ప్రశాంతి తిపర్నేని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 2న సినిమా రిలీజ్ కానుంది. ప్రమోషన్స్‌‌‌‌‌‌‌‌లో స్పీడ్ పెంచిన మేకర్స్ ఆల్రెడీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇంప్రెస్ చేశారు. గురువారం ‘ఉరికే ఉరికే’ అనే రొమాంటిక్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ‘రానే వచ్చావా, వానై నా కొరకే. వేచే ఉన్నాలే. నీతో తెచ్చావా ఏదో మైమరుపే. నువ్వే ఎదురున్నా .. తడుతూనే పిలిచానే నిన్నే ఎవరంటూ. కాలం పరుగులనే బ్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ. ఉరికే.. ఉరికే.. మనసే ఉరికే. దొరికే.. దొరికే.. వరమై దొరికే’ అంటూ సాగే పాటలో  శేష్, మీనాక్షి కెమిస్ట్రీ ఆకట్టుకుంది. విజువల్స్ ప్లెజెంట్‌‌‌‌‌‌‌‌గా ఉన్నాయి. కూల్ పోలీస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ కె.డి పాత్రలో శేష్,  ఆర్యగా మీనాక్షి ఒకరిపై ఒకరు ప్రేమను తెలియజేసుకుంటూ కనిపిస్తున్నారు. ఎం.ఎం.శ్రీలేఖ ట్యూన్ చేయగా, కృష్ణకాంత్ బ్యూటీఫుల్ లిరిక్స్ రాశాడు. సిద్ శ్రీరామ్ పాడటంతో సాంగ్ స్పెషల్ అట్రాక్షన్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. రావు ర‌‌‌‌‌‌‌‌మేష్‌‌‌‌‌‌‌‌, పోసాని కృష్ణ ముర‌‌‌‌‌‌‌‌ళి, త‌‌‌‌‌‌‌‌నికెళ్ల భ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ణి,  కోమ‌‌‌‌‌‌‌‌లి ప్రసాద్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.