పనిచేయని భార్యకు అక్రమంగా జీతం

పనిచేయని భార్యకు  అక్రమంగా జీతం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రైవేట్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ కంపెనీకి చెందిన ఓ ఉద్యోగి సంస్థను దారుణంగా మోసం చేశాడు. పక్కా ప్లాన్​ వేసి దశాబ్ద కాలంగా ఆ కంపెనీ నుంచి కోట్లాది రూపాయలను జేబులో వేసుకున్నాడు. మ్యాన్‌‌‌‌‌‌‌‌పవర్‌‌‌‌‌‌‌‌గ్రూప్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌లో మాజీ ఫైనాన్స్ మేనేజర్ రాధావల్లభ్​ నాథ్, కంపెనీ పేరోల్ విధానాన్ని తారుమారు చేశాడు. తన నిరుద్యోగ భార్యను రహస్యంగా ఉద్యోగంలో చేర్చాడు. కొన్నేళ్లపాటు  రూ. 4 కోట్లకు పైగా జీతం ఇచ్చాడు. ఇందుకోసం దొంగ లెక్కలు తయారు చేశాడు.  అసలు సంగతి గత ఏడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో బయటికి వచ్చింది. నాథ్​ చేసిన పని సంస్థకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. 

అధికారులు ఇప్పుడు ఈ ఆర్థిక నేరంపై దర్యాప్తు చేస్తున్నారు. భార్యకు జీతం ఎలా చెల్లించాడనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. కంపెనీలో కేవలం ముగ్గురు అధికారులకు మాత్రమే... - డైరెక్టర్ (హ్యూమన్​ రిసోర్సెస్​), చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్,  నిందితుడు నాథ్​కు - మంత్లీ పేరోల్  రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ డేటాకు యాక్సెస్​ ఉంటుంది. అవుట్​సైడ్​ పేరోల్​వెండర్​, ఇతర డిపార్ట్​మెంట్లకు కీలకమైన లింక్ ఇతడేనని అధికారులు చెబుతున్నారు.  పేరోల్ డేటాలో అతని భార్య  సుస్మితా రౌల్ పేరును చేర్చి నెలానెలా జీతం జమ చేశాడు. ఇందుకోసం సంబంధిత జీతం మొత్తంతో ఎక్సెల్​షీట్​లో అదనపు వరుసను చేర్చాడు. అంతేగాక తన సొంత జీతాన్ని పెంచుకోవడం కొసమెరుపు.