గురుకుల విద్యార్థినుల సమస్యలు పరిష్కరించాలి : జాగృతి అధ్యక్షురాలు కవిత

 గురుకుల  విద్యార్థినుల సమస్యలు పరిష్కరించాలి : జాగృతి అధ్యక్షురాలు  కవిత

బాన్సువాడ, వెలుగు: గురుకుల పాఠశాల విద్యార్థినుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని జాగృతి అధ్యక్షురాలు  కవిత అన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి పూలమాలవేసి అక్కడే ఉన్న గురుకుల పాఠశాలను సందర్శించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాస్ట్యూమ్స్ చార్జీలు చెల్లించాలని అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను తీర్చాలని, వారికి ప్రభుత్వ ఇంటి స్థలం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.