
జనగామ అర్బన్/ బచ్చన్నపేట, వెలుగు : మహిళలు ఆర్థికంగా ప్రగతి సాధించాలని, ఇందుకోసమే ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకానికి శ్రీకారం చుట్టిందని జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. కలెక్టరేట్ ఎదుట కల్యాణి స్వయం సహాయక సంఘానికి చెందిన మంజుల రూ.2 లక్షల రుణంతో ఏర్పాటు చేసిన వనిత టీ స్టాల్ ను బుధవారం కలెక్టర్ ప్రారంభించారు. అంతకుముందు కలెక్టరేట్లో ఓపెన్స్కూల్కు
సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం బచ్చన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి, ఫర్టిలైజర్ షాపులను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రిజిస్టర్, ల్యాబ్ టెస్టులను పరిశీలించారు. ప్రతిరోజు ఇద్దరు డాక్టర్లు నైట్డ్యూటీలో ఉండాలని ఆదేశించారు.