కన్నడ పోరు..ఓటర్లు ఎవరికి పట్టం కడతారు

కన్నడ పోరు..ఓటర్లు ఎవరికి పట్టం కడతారు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మే10వ తేదీ బుధవారం పోలింగ్ జరగనుంది. ఉదయం  7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.  ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ను అధికారులు నిర్వహించనున్నారు

రాష్ట్ర వ్యాప్తంగా 37,777 ప్రాంతాల్లో 58,545 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతీ నియోజకవర్గంలో ఐదు మహిళ మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 5.30 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 11,71,558 మంది యువ ఓటర్లు,12,15,920 మంది 80 ఏళ్లు పైబడిన ఓటర్లు ఉన్నారు. 5,71,281 మంది పీడబ్ల్యూడీ ఓటర్లు ఉన్నారు.  

ఎన్నికల పోలింగ్ కోసం భారీభద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ పోలింగ్ విధుల్లో నాలుగు లక్షల మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించబోతున్నారు.  ఎన్నికల నిర్వహణ కోసం 84,119 మంది రాష్ట్ర పోలీసులు, 58,500 మంది CAPF పోలీసులను మోహరింపచేశారు. బందోబస్తు నిర్వహిస్తారు. ఏపీ, తెలంగాణ,గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో 185 ఇంటర్‌స్టేట్ బోర్డర్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. 

224 అసెంబ్లీ స్థానాలకు 2613 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో 2,427 మంది పురుష అభ్యర్థులు, 185 మంది మహిళలు, ఇతర అభ్యర్థులు ఒకరు ఉన్నారు. ఎన్నికల బరిలో బీజేపీ నుంచి 224, కాంగ్రెస్‌ నుంచి 223, జేడీఎస్‌ నుంచి 207, ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి 209, మంది బీఎస్పీ నుంచి 133, సీపీఐ నుంచి నలుగురు, జేడీయూ నుంచి 8 మంది, ఎన్‌పీపీ నుంచి ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. రిజిస్టర్డ్‌ అన్‌రికగ్నైజ్డ్‌ పొలిటికల్‌పార్టీస్‌  కింద 685 మంది పోటీ పడుతున్నారు. 918 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.