
- 31న ఏకగ్రీవంగా ఎన్నుకోనున్న సంఘం నేతలు
హైదరాబాద్, వెలుగు: సింగరేణి కార్మిక సంఘాల విషయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఇటీవల టీబీజీకేఎస్ (తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) గౌరవాధ్యక్షురాలిగా కవితను తప్పించి కొప్పుల ఈశ్వర్‌ను నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా కవితను హిందూస్తాన్ మజ్దూర్ సభ (హెచ్ఎంఎస్) గౌరవాధ్యక్షురాలిగా ఎన్నుకోనున్నారు. ఈ నెల 31న మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసి కవితను గౌరవాధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు హెచ్ఎంఎస్జనరల్ సెక్రటరీ రియాజ్‌అహ్మద్ ప్రకటించారు.
టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా సింగరేణి కార్మికుల కోసం ఆమె అందించిన సేవలను పరిగణనలోకి తీసుకుని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు సంఘం ప్రతినిధులు వెల్లడించారు. ఇటీవల హైదరాబాద్‌లోని కవిత నివాసంలో సింగరేణి జాగృతి, హెచ్ఎంఎస్ నాయకులు భేటీ అయ్యారు.