సామాజిక తెలంగాణ కోసం కేసీఆర్ నన్ను రమ్మన్నారు: ఎల్.రమణ

సామాజిక తెలంగాణ కోసం కేసీఆర్ నన్ను రమ్మన్నారు: ఎల్.రమణ
  • ప్రగతి భవన్ బయట ప్రెస్ మీట్ 

హైదరాబాద్: సామాజిక తెలంగాణ కోసం కేసీఆర్ తనను రమ్మన్నారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ వెల్లడించారు. గురువారం సాయంత్రం ఆయన మంత్రి ఎర్రబెల్లితో కలసి సీఎం కేసీఆర్ ను కలిశారు. సమావేశం అనంతరం ప్రగతి భవన్ బయట మీడియాతో మాట్లాడారు టిటిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ. సీఎం కేసీఆర్ తో జరిగిన చర్చలో వివిధ అంశాలు చర్చకు వచ్చాయని, రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత రాజకీయ పరిణామాలపై చర్చ జరిగిందన్నారు. సామాజిక తెలంగాణ కోసం ముందుకు వెళ్లాలన్న ఆలోచనను కేసీఆర్ చెప్పారని, నన్ను తనతో పాటు కలసి రావాలని కోరారని ఆయన స్పష్టం చేశారు. టిఆర్ఎస్ పార్టీలోకి రావాలని కేసీఆర్ ఆహ్వానించారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ వెల్లడించారు. సానుకూలంగా నిర్ణయం ఉంటుందని కేసీఆర్ కు చెప్పానని అన్నారు.
రమణ అంటే కేసీఆర్ కు అభిమానం: ఎర్రబెల్లి
మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ చేనేత కుటుంభం నుంచి వచ్చిన రమణ టిఆర్ఎస్ పార్టీకి చాలా అవసరం అన్నారు. చేనేత వర్గాలకు చాలా చేశాము...ఇంకా చేయాల్సి ఉందని.. అందుకే రమణను టిఆర్ఎస్ రావాలని కేసీఆర్ ఆహ్వానించారని వెల్లడించారు. కేసీఆర్ పిలుపునకు రమణ సానుకూలంగా స్పందించారని, నేను, రమణ ఒకరికొకరం శ్రేయోభిలాషులమని.. తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ నిలబడేపరిస్థితి లేదని ఎర్రబెల్లి పేర్కొన్నారు.