ఆడి కారులో వచ్చి ఆకుకూరలు అమ్మిన రైతు.. వీడియో వైరల్‌

ఆడి కారులో వచ్చి ఆకుకూరలు అమ్మిన రైతు.. వీడియో వైరల్‌

కూరగాయలను రైతులు ఎలా అమ్ముతారు...? భారీ గంపలో పెట్టుకుని..లేదా సైకిల్ పై ఇళ్లు ఇళ్లూ తిరిగి కూరగాయలు అంటూ అమ్ముకుంటారు రైతులు. మరికొందరు రైతులు మార్కెట్ కు ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లో తాము పండించిన కూరగాయల తీసుకెళ్లి ఓ చోట కూర్చోని  విక్రయిస్తారు. కానీ ఓ రైతు మాత్రం..తాను పండించిన కూరగాయలను ఏకంగా కారులో తీసుకెళ్లి మరీ విక్రయిస్తున్నాడు. కారు అంటే..మామూలు కారు కాదు..అది ఆడి కారండీ బాబు..? వివరాల్లోకి వెళ్తే..

కేరళకు చెందిన యువ రైతు సుజిత్.. గత 10 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. తనకున్న వ్యవసాయ పొలంలో కూరగాయాలు, ఆకుకూరలను పండిస్తున్నాడు. ఉదయాన్నే నిద్రలేచే సుజిత్..తన పొలంలో పండించిన ఆకు కూరలను కోస్తాడు. అనంతరం తన  ఆడీ A4 లగ్జరీ కారులో మార్కెట్ కు వెళ్లి ఆకు కూరలను అమ్ముకుంటాడు. ప్రస్తుతం ఆడి కారులో ఆకు కూరలు అమ్ముతున్న వీడియో వైరల్ అయింది.

ALSO READ: ఈ ఐదు తెలిస్తేనే.. భవిష్యత్లో ఉద్యోగం.. లేకపోతే అంతే
 

https://www.instagram.com/reel/CxngCBxBumk/?utm_source=ig_web_copy_link  
ఈ వీడియోలో యువ రైతు సుజిత్  తాను పండించిన ఆకు కూరలను సేకరిస్తాడు. ఆ తర్వాత ఆడి కారులో  వచ్చి తన కూరగాయలను మార్కెట్‌కి తరలించడానికి ఆటో దగ్గరకు  వెళ్తాడు. మార్కెట్ కు వెళ్లాక..రైతు సుజిత్ ట్విస్ట్ ఇచ్చాడు.   అప్పటి వరకు ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిలా ఆడికారులో వచ్చిన రైతు సుజిత్..కారు దిగి  ఆటో దగ్గరకు వెళ్లి తన లుంగీని తీసేసి సాధారణ విక్రయదారుడిగా మారిపోతాడు. ఆకుకూరలన్నీ రోడ్డు పక్కన ప్లాస్టిక్ షీట్‌పై పరిచి అమ్ముతాడు. ఆకుకూరల అమ్మకం పూర్తయ్యాక అన్నీ సర్దుకుని తన కారులోకి ఇంటికి వెళ్తాడు. మళ్లీ కారులోకి వెళ్లేటప్పుడు తన షార్ట్స్ చుట్టూ లుంగీని చుట్టుకుని కారు నడుపుకుంటూ వెళ్లిపోతాడు. ఈ వీడియోను రైతు సుజిత్ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్‌ చేశాడు.