
- స్కూళ్లలో అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయండి
- అధికారులకు ఖమ్మం కలెక్టర్ ఆదేశం
ఖమ్మం టౌన్, వెలుగు: రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో చదువుకునే పిల్లలకు ఏ లోటు లేకుండా చూడాలని, ఏమైనా నిధులు కావాలంటే నివేదిక పంపాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఖమ్మం నగరంలోని దానవాయిగూడెంలో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీ(లేడీస్), కోయచలక క్రాస్ రోడ్ లోని మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్అండ్ కాలేజీ, మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల గురుకుల స్కూల్‌ను సందర్శించారు.
సోషల్ వెల్ఫేర్ లో రూ.కోటి 50 లక్షలతో మంజూరు చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రహరీ నిర్మాణం త్వరగా చేపట్టాలని, మిషన్ భగీరథ ద్వారా వారట్ ట్యాంకుకు నీళ్లు సరఫరా చేసి వాటర్ ప్రాబ్లమ్ లేకుండా చూడాలని సూచించారు. WEEEEఅంబేద్కర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో రూ.10 లక్షలతో చేపట్టిన పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్టూడెంట్స్‌కు చదువుతో పాటు క్రీడలకూ సమయం ఇవ్వాలని సిబ్బందికి చెప్పారు. కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ జోనల్ అధికారి స్వరూపారాణి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి డాక్టర్ పురందర్, ప్రిన్సిపాళ్లు విజయదుర్గా, శైలజ, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.