డీసీసీ పదవికి ఖానాపూర్ నేతల దరఖాస్తు

డీసీసీ పదవికి ఖానాపూర్ నేతల దరఖాస్తు

ఖానాపూర్, వెలుగు: నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఖానాపూర్​కు చెందిన పార్టీ సీనియర్ నాయకులు దరఖాస్తులు చేసుకున్నారు. ఖానాపూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ధోనికేని దయానంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజురా సత్యం ఆదివారం వేర్వేరుగా తమ అనుచరులతో వెళ్లి నిర్మల్ పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో దరఖాస్తులు అందించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు. వారి వెంట ఆత్మ చైర్మన్ తోట సత్యం, నాయకులు స్వప్నల్ రెడ్డి, యూసుఫ్ ఖాన్, జంగిలి శంకర్, నిట్ట రవి, వీరేశం, విజేందర్ తదితరులు ఉన్నారు.