17ఏళ్ల క్రితం కిడ్నాపైన మహిళ ఆచూకీ లభ్యం

17ఏళ్ల క్రితం కిడ్నాపైన మహిళ ఆచూకీ లభ్యం

దేశ రాజధాని ఢిల్లీలో 17 ఏళ్ల క్రితం అంటే 2006లో కిడ్నాప్‌కు గురైన ఓ మహిళ ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. మే 22 న, సీమాపురి పోలీస్ స్టేషన్ కు అందిన రహస్య సమాచారంతో 17 సంవత్సరాల క్రితం కిడ్నాప్ చేయబడిన 32 సంవత్సరాల (ప్రస్తుతం) కిడ్నాప్ చేయబడిన బాలికను గుర్తించించారని DCP షాహదారా రోహిత్ మీనా స్పష్టం చేశారు.

బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు గోకుల్‌పురి పోలీస్ స్టేషన్‌లో 2006లో ఐపీసీ సెక్షన్ 363 కింద కేసు నమోదు చేశారు. "అమ్మాయిని 2006లో కిడ్నాప్ చేశారు. బాలిక తన ఇంటిని విడిచిపెట్టిన తర్వాత, చెర్దిహ్ జిల్లా బలియా యుపి గ్రామంలో దీపక్ అనే వ్యక్తితో నివసిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ తర్వాత కొన్ని వివాదాల కారణంగా లాక్ డౌన్ లో దీపక్‌ను వదిలి ఆమె గోకల్‌పురిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివసించడం ప్రారంభించిందని పోలీసులు తెలిపారు.

2023లో ఇప్పటి వరకు 116 మంది పిల్లలు, వ్యక్తులు కిడ్నాప్/అపహరణకు గురి కాగా, 301 మంది తప్పిపోయిన వ్యక్తులు షాహదారా జిల్లాలో తిరిగి లభ్యమయ్యారని DCP షాహదారా రోహిత్ మీనా చెప్పారు.