
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. ఉదయమే భక్తులు మల్లన్న కోనేరులో స్నానాలు చేసి స్వామివారికి పట్నంవేసి, బోనం సమర్పించి, అభిషేకం చేసి, గంగిరేగు చెట్టుకు ముడుపులు కట్టి కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మల్లన్న గుట్టపైన కొలువైన రేణుక ఎల్లమ్మ, నల్ల పోచమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు.
ఆలయ ఈవో అన్నపూర్ణ, ఏఈవో శ్రీనివాస్, పర్యవేక్షకుడు శ్రీరాములు, సురేందర్ రెడ్డి, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలందిచారు. కాగా హైదరాబాద్ లోని దోమలగూడకు చెందిన ఉప్పల కోటేశ్వరరావు, స్వతంత్ర దంపతులు కాటేజీ నిర్మాణానికి రూ. 15 లక్షల విరాళం ఈవో అన్నపూర్ణకి అందజేశారు.