అమ్మాపూర్ కురుమూర్తి ఆలయ హుండీ లెక్కింపు

అమ్మాపూర్ కురుమూర్తి ఆలయ హుండీ లెక్కింపు

చిన్నచింతకుంట, వెలుగు: మహబూబ్​నగర్​ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ శివారులో వెలసిన కురుమూర్తి ఆలయం హుండీని శనివారం లెక్కించారు. హుండీ ద్వారా రూ.9,11,816 ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్  జి.గోవర్ధన్ రెడ్డి తెలిపారు. 

కార్యక్రమంలో ఆలయ ఈవో మదనేశ్వర్ రెడ్డి, పరిశీలకులు శ్రీనివాసులు, ఆలయ కమిటీ సభ్యులు గోపాల్, రాము, భారతమ్మ, కురుమూర్తి, ఆలయ అర్చకులు వెంకటయ్య, సత్యనారాయణ, విజయ్ పాల్గొన్నారు.