
నందిపేట : మండల కేంద్రంలోని ఓంకార రూపిణీ దుర్గాదేవి మండపంలో ఆదివారం అమ్మవారు లక్ష్మీదేవి రూపంలో దర్శనమిచ్చారు. దుర్గాదేవి మాలధారులు రూ.కోటీ11 లక్షలతో అమ్మవారిని అలంకరించారు.
భక్తిశ్రద్ధలతో దేవీశరన్నవాత్రి ఉత్సవాలు
కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం అమ్మవార్ల మండపాల్లో పూజలు, హోమాలు చేశారు. విద్యానగర్ కాలనీలోని సాయిబాబా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సూక్తం హోమం, పూజలు చేశారు. గొల్లవాడలో బాయ్స్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపం వద్ద పూజలు , అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.