
రాష్ట్రంలో ధరణీ పేరుతో భూదోపిడి జరుగుతుందన్నారు ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎమ్ .కోదండరెడ్డి. భూధాన బోర్డు రద్దు చేసి..ఇప్పటికీ ప్రత్యామ్నాయం చూపలేదని విమర్శించారు. కామారెడ్డి జిల్లాలో జరిగిన సర్వోదయ సంకల్ప యాత్ర లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ జాతీయ పంచాయతీ రాజ్ చైర్మన్ మీనాక్షి నటరాజన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ పాల్గొన్నారు.