- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ రూరల్ మండలం అప్పాయపల్లి గ్రామ శివారులోని శ్రీబాలాజీ ఇండస్ట్రీస్ దగ్గర సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి విక్రయించాలని సూచించారు. పత్తికి 8 శాతం తేమ ఉంటే క్వింటాల్‌కు రూ.8110 మద్దతు ధర, 9 శాతం ఉంటే రూ.8020 వస్తుందన్నారు.
12 శాతం తేమ ఉండే పత్తిని సైతం పత్తి కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. తేమ, తరుగు పేరుతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అనితామధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు గోవింద్ యాదవ్, మన్యం కొండ నరేందర్ రెడ్డి, లీడర్ రఘు, ఎంఏవో శృతి, ఏఈ హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణ అభివృద్ధి లక్ష్యం
మహబూబ్ నగర్ అర్బన్: మహబూబ్ నగర్ నగరంలోని ప్రతి కాలనీలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని పంచముఖి కాలనీలో ఎంపీ డీకే అరుణతో కలిసి రూ.38 లక్షలతో సీపీ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతం క్యాంపు కార్యాలయంలో శత శాతం పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు(ఎన్ఎంఎంఎస్) టెస్ట్ కు సంబంధించిన స్టడీ మెటీరియల్ ను తన సొంత నిధులతో ఫ్రీగా వలంటీర్స్ కు ఎమ్మెల్యే అందజేశారు.
