
ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో అలర్ట్ అయింది కేంద్రప్రభుత్వం. చైనా, జపాన్, సౌత్ కొరియా, హాంకాంగ్, థాయ్ లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు.. RTPCR టెస్ట్ తప్పనిసరి చేస్తామన్నారు కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మన్సుఖ్ మాండవీయ. టెస్టులో పాజిటివ్ వచ్చినా.. కరోనా లక్షణాలు ఉన్నా క్వారంటైన్ లో ఉంచుతామన్నారు. విమానయాన శాఖతో మాట్లాడి ఉత్తర్వులు ఇస్తామని మన్సుఖ్ మాండవీయ అన్నారు.
చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లోనే ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేశామని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. కరోనాను కట్టడి చేసేందుకు ఇప్పటికే అన్నిరాష్ట్రాలను అప్రమత్తం చేశామని చెప్పారు. ప్రతి ఒక్కరూమాస్కులు ధరించాలని.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.