మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీని నియమిస్తాం : డాక్టర్ నరేందర్ కుమార్

మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీని నియమిస్తాం :  డాక్టర్ నరేందర్ కుమార్
  • మెడికల్​ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్​ నరేందర్ కుమార్

యాదాద్రి, వెలుగు : యాదాద్రి మెడికల్ కాలేజీలో త్వరలో టీచింగ్​ స్టాఫ్​ పోస్టులు నియమిస్తామని మెడికల్​ఎడ్యుకేషన్​ డైరెక్టర్ డాక్టర్​నరేందర్​ కుమార్​ తెలిపారు. కలెక్టర్​హనుమంతరావుతో కలిసి జిల్లాలోని పగిడిపల్లిలోని మెడికల్ కాలేజీని ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా నరేందర్​కుమార్​ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాల ఫ్యాకల్టీ నోటిఫికేషన్ విడుదలైందని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా నాన్ టీచింగ్, టెక్నీకల్ సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. 

మెడికల్ కాలేజీ నూతన బిల్డింగ్​ను మూడేండ్లలో నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చి విధంగా ప్లాన్​ చేస్తున్నామని వివరించారు. అనంతరం మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న భువనగిరిలోని జిల్లా ఆస్పత్రిని ఆయన సందర్శించారు. విభాగాల వారీగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, డాక్టర్లు, సిబ్బంది ఖాళీలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఇంకనూ కొత్తగా సమకూర్చాల్సిన సదుపాయాలు తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. 

వివిధ విభాగాలను సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. సేవలు, డాక్టర్లు, సిబ్బంది ఖాళీలు, అందుబాటులో జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. జాతీయ మెడికల్ కౌన్సిల్ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా కాలేజీలో వసతులను సమకూర్చకోవాలని సూచించారు. వారి వెంట యాదాద్రి, మహేశ్వరం మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్స్​రమేశ్ రెడ్డి, నాగేంద్ర, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, చిన్నానాయక్ ఉన్నారు.