సుదీర్ఘకాలం తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సమావేశం ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించి రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. విభజన సమస్యలు, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలపై జనవరి 12న 11 గంటలకు జరగనున్న సమావేశానికి హాజరు కావాలని తెలిపింది. ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో సమావేశం జరగనుంది.
