AI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వీడియో కాలింగ్

AI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వీడియో కాలింగ్

US-బేస్డ్ టెక్ దిగ్గజం మైక్రో సాఫ్ట్, టీమ్స్ కాల్‌ల కోసం AI-ఆధారిత నాయిస్ రిడక్షన్ ఫీచర్‌ను ప్రకటించింది. ఇది బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తగ్గించడానికి, మీటింగ్‌లలో పాల్గొనే ఇతర వ్యక్తుల వాల్యూమ్‌ను తగ్గించడానికి రూపొందించబడింది. దీంతో పాటు టీమ్స్ decorate your background అని పిలవబడే ఒక ఉల్లాసభరితమైన AI ఫీచర్‌ను కూడా పరిచయం చేశాయి, దీని వలన యూజర్స్ తమ వర్చువల్ వర్క్‌స్పేస్‌ను డిక్లట్టర్ చేయడం ద్వారా లేదా బ్యాక్‌గ్రౌండ్‌కి డెకరేటివ్ థీమ్స్ ను చేర్చుకోవచ్చు.

డెవలపర్లు, IT నిపుణుల కోసం మైక్రోసాఫ్ట్ వార్షిక ఇగ్నైట్ కాన్ఫరెన్స్‌లో ఈ ఫీచర్లు ప్రకటించారు. కంపెనీ Windows, Microsoft 365, Azureతో సహా ఇతర ఉత్పత్తులు, సేవల కోసం కొత్త మార్పులు, ఫీచర్స్ ను కూడా ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ టీమ్స్ ప్రీమియం యూజర్స్ కు 2024 ప్రారంభంలో అందుబాటులోకి వస్తుంది. అదే సమయంలో, మైక్రోసాఫ్ట్ వాయిస్ ఐసోలేషన్ ఫీచర్ రోల్ అవుట్‌ను కూడా ప్రారంభించింది. ఇది 2024లో అందుబాటులోకి రానుంది.