మధుసూదన్ రెడ్డి సేవలు అభినందనీయం : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

మధుసూదన్ రెడ్డి సేవలు అభినందనీయం : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి
  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి 

నల్గొండ అర్బన్, వెలుగు : విద్యాశాఖ కార్యాలయంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా, తన అధికారిక సహాయకుడిగా పనిచేసిన మధుసూదన్ రెడ్డి సేవలు అభినందనీయమని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండలోని ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో మధుసూధన్ రెడ్డి పదవీ విరమణ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మధుసూదన్ రెడ్డిని శాలువా, పుష్పగుచ్ఛం, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి భార్య జ్యోతి, కూతురు శ్రీనిధి, జడ్పీ సీఈవో ప్రేమకరణ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు లక్ష్మీశ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్ గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.